One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Update: 2024-09-18 10:16 GMT

One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు రానుంది. కోవింద్ కమిటీ 18వేల 626 పేజీల నివేదికను రాష్ట్రపతి ముర్ముకు అందజేసింది. 2023 సెప్టెంబర్ 2న కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 47 పొలిటికల్ పార్టీల నుంచి సలహాలు, సూచనలను కమిటీ సేకరించింది.

వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై మాజీ రాష్ట్రపతి కమిటీ సభ్యులతో చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Tags:    

Similar News