Aadhaar: ఆధార్ కార్డులో ఫొటో మార్చాలా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..!
Aadhaar: ఆధార్ కార్డులో ఫొటో మార్చాలా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..!
Aadhaar: కాలం మారుతున్న కొద్దీ ఆధార్ కార్డ్ చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు అన్ని పత్రాలతో పోలిస్తే ఆధార్ చాలా ముఖ్యమైన పత్రం. ఆధార్ కార్డ్ లేకుంటే చాలా పనులు అసంపూర్తిగా మిగులుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. ఆధార్ కార్డు అవసరాలు, ప్రాముఖ్యతను లెక్కలోకి తీసుకొని అనేక సార్లు మార్పులు చేయడం లేదా నవీకరించడం జరుగుతుంది. ఆధార్ కార్డును జారీ చేసిన ప్రభుత్వ సంస్థ UIDAI ఆధార్ కార్డులో అవసరమైన మార్పులు చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో మీ పేరు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
అప్పుడప్పుడు ఆధార్ఫొటోల విషయంలో మార్పులు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆధార్‌లో ఫొటో పాతది ఉంటే ఇబ్బందులు తలెత్తొచ్చని చాలా మంది భావిస్తుంటారు. అంలానే మీకూ ఇలా అనిపిస్తుంటే సులభంగా మీరు ఆధార్‌లో ఫొటోను మార్చుకోవచ్చు.ఆధార్‌లో ఫొటో ఛేంజ్ చేయాలంటే ముందుగా ఆధార్ పర్మినెంట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ని సంప్రదించాలి.
ఆధార్ సెంటర్‌లో ఎన్‌రోల్‌మెంట్ ఫారం తీసుకోవాలి. లేదంటే యూఐడీఏఐ వెబ్సైట్లో ఈ ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫారంలో ముఖ్యమైన అన్ని వివరాలను నింపాలి. ఆ ఫారంను ఆధార్ సిబ్బందికి ఇస్తే మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్తీసుకుంటారు. బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత ఆధార్సిబ్బంది మీ కొత్త ఫొటోను తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయితే మీ ఆధార్ కార్డులో పొటో ఛేంజ్ అయిపోతుంది. కొత్త ఫొటో ఉన్న కార్డ్ వారం రోజుల్లో పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. ఫొటోను మార్చేందుకు గానూ యూఐడీఏఐ రూ.100 ఛార్జీ వసూలు చేస్తుంది. అయితే ఆధార్‌లో ఫొటో ఛేంజ్ అయ్యిందా లేదా విషయాన్ని తెలుసుకునేందుకు మీకు ఓ అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) వస్తుంది. దీనిని ఉపయోగించి మీ రిక్వెస్ట్ స్టెటస్‌ని తెలుసుకోవచ్చు.