Coronavirus: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

Coronavirus: రెట్టింపు వేగంతో విస్తరిస్తోన్న మహమ్మారి * దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి, 56లక్షల, 16వేల,130

Update: 2021-04-21 05:49 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: కరోనా మహమ్మారి యావత్‌ భారత్‌ను వణికిస్తోంది. రెట్టింపు వేగంతో విస్తరిస్తోన్న ఈ మహమ్మారి.. ఒక్క రోజే దాదాపు 3లక్షల మందిపై విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2లక్షల, 95వేల, 41కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి, 56లక్షల, 16వేల,130కి చేరింది. కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. ఇక మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది. దేశంలో రోజువారీ మరణాలు 2వేలు దాటడం ఇదే తొలిసారి.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 1లక్షా, 82వేల, 553 మంది బలయ్యారు. మరణాల రేటు 1.18శాతంగా ఉంది. ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 519, ఢిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో మరో లక్షా, 67వేల, 457 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక కోటి, 32లక్షల, 76వేల, 39 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 85.56శాతంగా ఉంది.

కరోనా ఉద్ధృతితో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21లక్షల, 57వేల, 538 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక తొలుత మహారాష్ట్రలో మొదలైన కరోనా రెండో దశ ఉద్ధృతి చాపకింద నీరులా దేశమంతా పాకింది. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటకల్లో రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 62వేల, 97, యూపీలో 29వేల, 754, ఢిల్లీలో 28వేల,395, కర్ణాటకలో 21వేల, 794 కొత్త కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News