అడ్వాన్స్‌డ్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన ఇండియన్ నేవీ
BrahMos Missile: బ్రహ్మోస్ క్షిపణులను మరోసారి పరీక్షించింది నేవీ.
BrahMos Missile: బ్రహ్మోస్ క్షిపణులను మరోసారి పరీక్షించింది నేవీ. ఆధునిక బ్రహ్మోస్ క్షిపణులను భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. దూరంలోని లక్ష్యాలను చేధించగల లాంగ్‌రేంజ్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను శనివారం విజయవంతంగా పరీక్షించినట్లు నేవీ ప్రకటించింది. నిర్థేశిత లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసిందని ప్రకటించారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిగా దేశీయంగా తయారు చేసిన మిస్సైల్ ఇది. రష్యాతో కలిసి ఇండియా దీన్ని రూపొందించడం విశేషం. ఈ మిస్సైల్స్ భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయని నేవీ ప్రకటించింది. సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అయిన సుఖోయ్ 30 కేఎం-ఐ నుంచి ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు.