NTPC 2022: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. NTPCలో ఉద్యోగాలు.. నెలకి రూ.90 వేల జీతం..
NTPC 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
NTPC 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Careers.ntpc.co.inని సందర్శించాలి. ఏప్రిల్ 8లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 55 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 50ఎగ్జిక్యూటివ్ (కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్), 4 ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్ - పవర్ ట్రెండింగ్),1ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్ పవర్ ట్రేడింగ్) పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు
1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 25 మార్చి 2022.
2. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 8 ఏప్రిల్ 2022.
విద్యార్హతలు
1. ఎగ్జిక్యూటివ్ (కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60% మార్కులతో పాటు
కనీసం రెండేళ్ల పని అనుభవంతో పాటు డిగ్రీని కలిగి ఉండాలి.
2. ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్ - పవర్ ట్రెండింగ్) పోస్టుల కోసం అభ్యర్థులు 60% మార్కులతో ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, సంబంధిత రంగాలలో మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
3. ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్ పవర్ ట్రేడింగ్) కోసం 60% మార్కులతో అభ్యర్థులు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి
ఈ పోస్టులన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 35 సంవత్సరాలు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 90,000 జీతం చెల్లిస్తారు.
అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
1. ముందుగా అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ http://www.ntpc.co.inకి వెళ్లండి.
2. ఆ తర్వాత కెరీర్ పేజీలో న్యూ జాబ్స్‌పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
4. ఆపై మీ పత్రాలను అభ్యర్థికి అప్‌లోడ్ చేయండి.
5. చివరిగా అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి.