Union Budget 2021 : బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ

Update: 2021-02-01 05:37 GMT

బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ

వచ్చే ఆర్థిక సంవత్సారానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ఎన్నో అంచనాలున్నాయి. ఆదాయపన్ను మినహాయింపుల పెంపు, పన్ను శ్లాబుల మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. కరోనా సుంకం విధించే చాన్స్ ఉంది. దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చడానికి ప్రోత్సహకాలు ఇచ్చేందుకు 2021-2022 బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి.

కరోనా కారణంగా ఆరోగ్యరంగానికి ఎక్కువగా కేటాయింపులు ఉండనున్నాయి. ఈ సారి సార్వత్రిక వైద్య బీమా కల్పించనున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 6 వేల నుంచి 10వేలకు పెంచనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు ఇవ్వనున్నారు. పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు పంటలకు ప్రోత్సహం కల్పించనున్నారు.

బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించేలా యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయంగా వైద్య, విద్యుత్తు పరికరాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్, రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సహం ఇవ్వనున్నారు. కిసాన్ రైలు, విమాన సేవల విస్తృతి పెంచనున్నారు. రైలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ బడ్జెట్‌లో బుల్లెట్ రైలు మార్గాల గురించి ప్రస్తావించనున్నారు. వంటగ్యాస్‌పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సీడీలు పెంచనున్నారు. కొత్త ఎయిమ్స్, ఐఐటీలు ప్రకటించనున్నారు. పశు, మత్స్య, ఉద్యాన, ఆహారశుద్ధీ, కుటీర పరిశ్రమలకు ప్రోత్సహాకాలు ఉండనున్నాయి.

రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సహాకాలు ఉండనున్నాయి. ప్రత్యమ్నాయ ఇంధనం, విద్యుత్తు విహనాలకు ప్రోత్సహం ఉండనుంది. APMC మార్కెట్‌ ఆధునికీకరణకు నిధులు సమకూర్చనున్నారు. ఈ-మండీలకెు 800- వెయ్యి కోట్లకు పెంచనున్నారు. భారత్‌మాల, సాగర్‌మాల ప్రాజెక్టులకు కేటాయింపు పెంచనున్నారు. కొత్తగా వైద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంది.

Tags:    

Similar News