దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ BF7 అలజడి.. ముక్కుద్వారా ఇచ్చే టీకాకు కేంద్రం అనుమతి
Nasal Vaccine: దేశంలో మళ్లీ కరోనా భయం మొదలైంది.
Nasal Vaccine: దేశంలో మళ్లీ కరోనా భయం మొదలైంది. ఈనేపథ్యంలో ఈసారి వచ్చిన కొత్త వేరియంట్ ను తట్టుకునేందుకు ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ నాసల్ కరోనా టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ తట్టుకునేందుకు దేశ ప్రజలందరికీ రెండు చుక్కల నాసల్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు తీసుకున్నవాళ్లు.. బూస్టర్ డోసు రూపంలో నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి చేపట్టే ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో ఈ నాసల్ వ్యాక్సిన్ కూడా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే కోవిన్ అప్లికేషన్‌లోనూ ఈ నాసల్ వ్యాక్సిన్ డిటేల్స్ ఉంటాయని తెలిపారు. అయితే ఈ టీకా ఇప్పటికైతే కేవలం ప్రైవేటు హాస్పిటళ్లలో ఇవ్వనున్నారు.