NASA Report: కలకలం రేపుతున్న నాసా నివేదిక.. 12 నగరాలు కడలి గర్భంలో..

NASA Report: 21వ శతాబ్దంలో భారత్ లో తీర ప్రాంతాలు నీట మునుగుతాయన్న నాసా నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది.

Update: 2021-08-11 14:43 GMT

NASA Report: కలకలం రేపుతున్న నాసా నివేదిక.. 12 నగరాలు కడలి గర్భంలో..

NASA Report: 21వ శతాబ్దంలో భారత్ లో తీర ప్రాంతాలు నీట మునుగుతాయన్న నాసా నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది. విశాఖ సహా 12 నగరాలు కడలి గర్భంలో కలిసిపోతాయన్న నివేదిక సారాంశం అందరినీ ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచుకొండలు కరిగి సముద్ర మట్టాలు పెరిగి భారత తీర ప్రాంతాల మునక ఖాయమని నాసా హెచ్చరిస్తోంది.

అంటే మరో 8 దశాబ్దాల్లో భారత్ కు పెనుముప్పు పొంచి ఉన్నట్లే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల పర్యావరణంలో వేడిగాలులు, అధిక వర్షాల అసమతుల్యత తప్పదని ఐక్యరాజ్యసమితి కమిటీ కూడా చెబుతోంది. 79 ఏళ్ల తర్వాత తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని ఉష్ణోగ్రతలు ఒకటిన్నర డిగ్రీ మేరకు పెరుగుతాయని, దానివల్ల విశాఖ, ముంబై, భావనగర్, కొచ్చి, మర్మగావ్, ఓకా, పారాదీప్, కాండ్లా, మంగళూరు, చెన్నై తూత్తుకూడి నగరాలకు ముంపు ముప్పు పొంచి ఉందని ఐపీసీసీ నివేదిక తెలిపింది.

Tags:    

Similar News