Narendra Modi: దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ విశ్వాసం ఇచ్చింది
Narendra Modi: యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి
Narendra Modi: మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని మోడీ హర్షం వ్యక్తంచేశారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన బడ్జెట్‌గా అభివర్ణించారు. వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుందన్నారు మోడీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారెంటీ ఇచ్చిందని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2కోట్ల ఇళ్ల నిర్మాణం గురించి ప్రకటించామన్నారు. సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ ఉద్దేశం అని మోడీ స్పష్టం చేశారు.