భారత్‌ బయోటెక్‌లో ముగిసిన ప్రధాని సమావేశం

Update: 2020-11-28 09:49 GMT

భార‌‌త్‌ బయోటెక్‌లో ప్రధాని మోడీ సమావేశం ముగిసింది. సమావేశంలో భాగంగా వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై శాస్త్రవేత్తలు మోదీకి వివరించారు. భేటీ అనంతరం భారత్‌ బయోటెక్‌ నుంచి హకీంపేట ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ బయల్దేరారు. మరికాసేపట్లో ప్రధాని పుణె వెళ్లనున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచ్చారు. జినోమ్‌వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ను సందర్శించి 'కొవాగ్జిన్‌' టీకా అభివృద్ధిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. కాగా కొవాగ్జిన్‌ టీకాపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక కొవాగ్జిన్‌ ప్రస్తుత పరిస్థితిపై భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. మొదట అహ్మదాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

Tags:    

Similar News