Babri Demolition Case: జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు

Babri Demolition Case: 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ ప్రముఖ నేత మురళి మనోహర్ జోషి వాంగ్మూలాన్ని ప్రత్యేక సిబిఐ కోర్టు గురువారం నమోదు చేసింది.

Update: 2020-07-23 14:31 GMT
Murli Manohar Joshi (File Photo)

Babri Demolition Case: 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ ప్రముఖ నేత మురళి మనోహర్ జోషి వాంగ్మూలాన్ని ప్రత్యేక సిబిఐ కోర్టు గురువారం నమోదు చేసింది. 86 ఏళ్ల జోషి వాంగ్మూలాన్ని సిబిఐ జడ్జి ఎస్కె యాదవ్.. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేశారు. ఇక ఇదే కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ (92) వాంగ్మూలాన్ని కూడా శుక్రవారం ఇదే విధంగా రికార్డ్ చేసే అవకాశం ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ కేసులో ప్రస్తుతం 32 మంది నిందితుల వాంగ్మూలాలను సిఆర్‌పిసి సెక్షన్ 313 కింద రికార్డ్ చేయనుంది సిబిఐ కోర్టు. అయోధ్యలో మసీదును డిసెంబర్ 6, 1992 న 'కర్ సేవకులు' పడగొట్టారు, ఇక్కడ పురాతన రామాలయం ఉందని పేర్కొంటూ.. మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో రామాలయం ఉద్యమానికి అద్వానీ, జోషి నాయకత్వం వహించిన వారిలో ఉన్నారు.

కాగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విచారణను వేగవంత చేసింది సిబిఐ. ఇక ఇదే కేసులో బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి ఈ నెల ప్రారంభంలో కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాజకీయ కక్ష కారణంగా ఈ కేసులో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను ఇరికించిందని ఆమె తన వాంగ్మూలంలో ఆరోపించారు. మరో సీనియర్ బిజెపి నాయకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ జూలై 13 న విచారణకు హాజరయ్యారు.  

Tags:    

Similar News