Mumbai: కాంట్రాక్టర్‌ని బురద నీటిలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే.. ప్రజాప్రతినిధులను కూడా ఇలాగే శిక్షిస్తారా ?

Mumbai: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దిలీప్‌లాండే అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది.

Update: 2021-06-14 02:23 GMT

Mumbai: కాంట్రాక్టర్‌ని బురద నీటిలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే.. ప్రజాప్రతినిధులను కూడా ఇలాగే శిక్షిస్తారా ?

Mumbai: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దిలీప్‌లాండే అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. ఓ పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు ఆయన బహిరంగంగా శిక్ష విధించారు. డ్రైనేజీ పనులు సరిగా చేయలేదని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టరుపై చెత్త వేయించారు. వర్షం కారణంగా నిలిచిన వరద నీటిలో కూర్చోబెట్టి అవమానించారు. శివసేన ఎమ్మెల్యే దిలీప్‌ లాండే అతని అనుచరుల సమక్షంలోనే ఈ అమానవీయ ఘటన జరిగింది.

ముంబయి సహా పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన చాంద్‌వాలి ఎమ్మెల్యే దిలీప్‌ లాండే రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో కాంట్రాక్టర్‌ను కూర్చోబెట్టి పారిశుద్ధ్య కార్మికులతో అతడిపై చెత్త వేయించారు. కాంట్రాక్టరును చూడగానే ఎమ్మెల్యే, అతని అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తప్పు జరిగిందని వేడుకున్నా వినకుండా దుర్భాషలాడారు. ఈ నిర్వాకాన్ని సమర్థించుకున్న శివసేన ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ పని సరిగా చేయలేదని మండిపడ్డారు.

ఈ ఘటనతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే జరిపిన దాడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టరు తరహాలోనే పనులు చేయని ప్రజాప్రతినిధులను కూడా శిక్షించాలంటూ మెజారీటీ ప్రజలు డిమాండ్‌ చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లను శిక్షించాల్సందేనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా తప్పులను సరిదిద్దేందుకు చాలా మర్గాలు ఉన్నాయని, ఇలాంటి అమానవీయ శిక్షలు సరికాదని మరికొందరు అన్నారు.

Tags:    

Similar News