Mumbai Has Lost Humanity : ముంబై మానవత్వం కోల్పోయింది : అమృత ఫడ్నవిస్

Mumbai Has Lost Humanity : ముంబై నగరం పైన కీలక వాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత

Update: 2020-08-04 09:09 GMT
Amruta Fadnavis(File Photo)

Mumbai Has Lost Humanity : ముంబై నగరం పైన కీలక వాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత ఫడ్నవిస్.. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ కేసులో భాగంగా ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ముంబై మహానగరం జీవించడానికి సురక్షితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు పైన విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. పోలీసులు కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే బిహార్‌ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించడంలేదనే చర్చ నడుస్తోంది. ​

ఈ నేపధ్యంలో దీనిపైన స్పందించారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత ఫడ్నవిస్ 'ముంబయి తన మానవత్వాన్ని కోల్పోయింది. నగర పోలీసులు సుశాంత్‌ సింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న తీరును చూస్తుంటే అమాయకులు, ఆత్మాభిమానం ఉన్నవారికి ఇక్కడ నివసించడం సురక్షితం కాదని అర్థమవుతోంది' అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలను శివసేన, ఎన్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం భార్యగా అమృత ఫడ్నవిస్‌ పోలీసులను నిందించటం సిగ్గుచేటు అని అన్నారు.

ఇక అంతకుముందు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సుశాంత్ ఆత్మహత్య కేసు పైన ముంబయి పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బిహార్ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించకపోవడం వింతగా ఉందని, ఇది మహారాష్ట్ర ప్రభుత్వం పైన పలు అనుమానాలను కలగాజేస్తుందని అన్నారు.

అటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది.  

Tags:    

Similar News