Social Media: కరోనా ఉధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు

Social Media: కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తాము నిస్సహాయులుగా మారామని ముంబైకి చెందిన ఓ వైద్యురాలు డాక్టర్‌ తృప్తిగిలాడి భావోద్వేగానికి గురయ్యారు.

Update: 2021-04-21 13:32 GMT

Social Media: కరోనా ఉధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు

Social Media: కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తాము నిస్సహాయులుగా మారామని ముంబైకి చెందిన ఓ వైద్యురాలు డాక్టర్‌ తృప్తిగిలాడి భావోద్వేగానికి గురయ్యారు. మాస్కు ధరించి జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ఉపద్రవం నుంచి బయటపడతామని ఆమె సూచించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, ముఖ్యంగా ముంబైలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులను తాను ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆ డాక్టర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. యువకులు కూడా వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నారని తృప్తిగిలాడి వీడియోలో స్పష్టం చేశారు. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని, వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, అందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు. 

Full View


Tags:    

Similar News