Raj Kundra: ముంబై పోర్న్ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం
Raj Kundra: శిల్పాశెట్టి ఇంట్లో ముంబై క్రైమ్ బ్రాంచ్ సోదాలు * పోర్న్ గ్రఫీ కేసులో శిల్పాశెట్టిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్
Raj Kundra: పోర్న్ గ్రఫీ కేసు దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే.. శుక్రవారం నాడు రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి ఇంట్లో సోదాలు జరిపారు. శిల్పాశెట్టికి ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. ఈకేసులో శిల్పాకు క్లీన్‌చిట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఆమెను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. రాజ్‌కుంద్రా రిమాండ్‌ను పొడిగించాలని కోరుతూ ఆయనను కోర్టు ముందు హాజరుపరచారు. రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్ ద్వారా సంపాదించిన సొమ్మును ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వెచ్చించేవారని పోలీసులు తెలిపారు.
రాజ్‌కుంద్రా రిమాండ్ పొడిగించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. రాజ్‌కుంద్రాను విచారించేందుకు ఈనెల 27 వరకూ రాజ్‌కుంద్రా కస్టడీని పొడిగించింది. రాజ్‌కుంద్రా సైతం తన అరెస్టును హైకోర్టులో సవాలు చేశారు. తన అరెస్టులో చట్టబద్ధతను ప్రశ్నించారు. ఒరిజినల్ ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదన్నారు. తన అరెస్ట్ తర్వాతే సీఆర్‌పీసీ 41 ఏ నోటీసుపై తనతో సంతకం చేయించుకున్నారని అన్నారు. ఇది చట్ట ఉల్లంఘనేనని తన పిటిషన్‌లో రాజ్‌కుంద్రా హైకోర్టు దృష్టికి తెచ్చారు.