ముడా స్కాం: సిద్దరామయ్యపై ఈడీ కేసు

Update: 2024-09-30 14:00 GMT

ముడా స్కాం: సిద్దరామయ్యపై ఈడీ కేసు

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అంటే ముడా ల్యాండ్ స్కామ్ లో ఆయనపై ఈ కేసు నమోదైంది. ఈ నెల 27న లోకాయుక్తలో కూడా ఆయనపై కేసు నమోదైంది,. ఇదే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ దాఖలు చేశారు.

సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజులులపై కేసు నమోదైంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రిపై లోకాయుక్త పోలీసుల విచారణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు గత వారం ఆదేశించడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది.సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్లను దర్యాప్తు సంస్థ ఉపయోగించింది.

తనను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆయన విమర్శించారు. తనపై ఇదే తొలి రాజకీయ కేసుగా ఆయన చెప్పారు. తన నిర్దోషిత్వాన్ని నిలుపుకుంటానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News