MP Man Marries Both His Girlfriends: వరుడొక్కడు.. వధువులిద్దరు.. ఒకే వేదికపై పెళ్లి!

MP Man Marries Both His Girlfriends: ప్రపంచంలో చాలా వింతలు జరుగుతున్నాయి. అందులో ఇది ఒకటి. ఇంతకీ ఈ వార్తలో అంత వింత ఏముందో అంటారా.. చూద్దాం పదండి.. !

Update: 2020-07-11 15:32 GMT
madhya pradesh

MP Man Marries Both His Girlfriends: ప్రపంచంలో చాలా వింతలు జరుగుతున్నాయి. అందులో ఇది ఒకటి. ఇంతకీ ఈ వార్తలో అంత వింత ఏముందో అంటారా.. చూద్దాం పదండి.. ఇప్పటివరకూ మనం ప్రేమ పెళ్ళిళ్ళు చూసుంటాం.. పెద్దలు కుదర్చిన పెళ్ళిళ్ళు చూసుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి తానూ ప్రేమించిన అమ్మాయిని, అటు పెద్దలు కుదర్చిన అమ్మాయిని ఒకే వేదిక పైన, ఒకే ముహూర్తానికి పెళ్ళాడాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగానే జరిగింది. ఈ విచిత్త్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని కెరియా గ్రామంలో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. బెతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్.. ఉన్నత చదువుల కోసం భోపాల్ వెళ్ళాడు. అక్కడ హోషంగాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో సందీప్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో చెప్పేలోపే.. సందీప్ తల్లిదండ్రులు తమ పక్కా గ్రామం కోయలరికి చెందిన మరో అమ్మాయితో సందీప్ కి పెళ్లి ఖాయం చేశారు. దీనితో సందీప్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఏం చేయాలో తెలియని కుటుంబసభ్యులు ఈ సమస్యను స్థానిక పంచాయితీ దృష్టికి తీసుకెళ్లారు.

అక్కడ పంచాయితీ పెద్దలు సందీప్‌తో కలిసి జీవించేందుకు ఇద్దరు అమ్మాయిలకు ఇష్టమైతే పెళ్లి జరిపించవచ్చునని చెప్పుకొచ్చారు. దీనికి అ ఇద్దరు అమ్మాయిలు ఇష్టమేనని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక సందీప్ కూడా దీనికి ఒకే చెప్పడం ఇక్కడ మరో కొసమెరుపు.. అంతేకాకుండా ఈ పెళ్ళికి ఆ మూడు కుటుంబాలూ అంగీకరించాయి. దీనితో జులై ఎనమిదిన కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సందీప్‌ ఆ ఇద్దరమ్మాయిలను పెళ్ళాడాడు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు దీనిపైన విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News