Madhya Pradesh: ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన.. బాధితుడి కాళ్లు కడిగి.. క్షమాపణలు చెప్పిన సీఎం!

Madhya Pradesh: తనకు ప్రజలే తనకు దేవుళ్లని, ఈ సంఘటన తనను కలచి వేసిందని సీఎం చౌహాన్‌ చెప్పారు.

Update: 2023-07-06 07:18 GMT

Madhya Pradesh: ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన.. బాధితుడి కాళ్లు కడిగి.. క్షమాపణలు చెప్పిన సీఎం!

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడు దశమత్‌ రావత్‌పై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడంపై సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంఘటనపై స్పందించిన శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు దశమత్ రావత్‌ను తన ఇంటికి పిలిపించారు.. రావత్‌ను కుర్చీలో కూర్చోబెట్టి పాదాలను కడిగారు. ఆయనకు శాలువ కప్పి సత్కరించి, క్షమాపణ చెప్పారు.. తనకు ప్రజలే తనకు దేవుళ్లని, ఈ సంఘటన తనను కలచి వేసిందని సీఎం చౌహాన్‌ చెప్పారు.

Tags:    

Similar News