Mood Of The Nation Poll : ఆ పదవికి రాహుల్ గాంధీ అయితేనే బెస్ట్!
Mood Of The Nation Poll : దాదాపుగా 135 ఏళ్ల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ ... దేశం మొత్తాన్ని పాలించిన పార్టీ అది.. కానీ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకి మాత్ర
Mood Of The Nation Poll : దాదాపుగా 135 ఏళ్ల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ ... దేశం మొత్తాన్ని పాలించిన పార్టీ అది.. కానీ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అయింది. రాహుల్ గాంధీ పగ్గాలు చెప్పటిన తర్వాత గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్లల్లో గల్లంతు అయిపొయింది. దీనితో అయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎవరు చెప్పిన అయన వినలేదు.. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతుంది.
అయితే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అంటూ అయనకి 23 శాతం ఓట్లు వచ్చాయి. పార్టీని బలోపేతం చేసేందుకు ఏ నాయకుడు బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 23 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటు వేశారు.
ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 14 శాతం ఓట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక రాజస్తాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ 2 శాతం ఓట్లు సంపదిన్చుకోగా, సచిన్ పైలట్ 3 శాతం ఓట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు.. ఇక ఈ సర్వేలో మొత్తానికి కాంగ్రెస్ అధ్యక్షపదవికి, పార్టీని ముందుండి నడిపేందుకు రాహుల్ గాంధీ అయితేనే బెస్ట్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. జూలై 15, 2020 మరియు జూలై 27, 2020 మధ్య ఈ సర్వే నిర్వహించడం జరిగింది.