PM Modi: ఇవాళ రేపు అసోంలో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: రూ.18 వేలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోడీ
PM Modi: నేటి నుండి రెండు రోజుల పాటు ప్రధాని మోడీ అసోంలో పర్యటించనున్నారు. 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సోనిత్‌పూర్ జిల్లాలోని తేజ్‌పూర్ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్‌కు వెళతారు. నేషనల్ పార్క్‌లోని కోహోరా రేంజ్‌లోని అసొం పోలీస్ గెస్ట్ హౌస్‌లో రాత్రికి మోడీ బస చేస్తారు. రేపు తెల్లవారుజామున ప్రధాని పార్క్ లోపల సఫారీ చేసి, అరుణాచల్ ప్రదేశ్‌కు బయలుదేరుతారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో పలు కార్యక్రమాలకు హాజరైన తర్వాత, ప్రధాని మధ్యాహ్నం 1గంటలకు 30నిమిషాలకు జోర్హాట్‌ను సందర్శిస్తారు, అక్కడ హోలోంగా పథర్‌లో 84 అడుగుల ఎత్తైన అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జోర్హాట్‌లోని మెలెంగ్ మెటెలి పోతార్‌లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. అలాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 5 లక్షల 50 వేలకు పైగా గృహాలకు 'గృహ ప్రవేశ' వేడుకను ప్రధాని నిర్వహించనున్నారు.