Narendra Modi: జెషోరేశ్వరి కాళీ మాత ఆలయంలో మోదీ పూజలు

‍‍Narendra Modi:ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఈ రోజు ఉదయం మోదీ సందర్శించారు.

Update: 2021-03-27 06:57 GMT

నరేంద్ర మోడీ:(ఫైల్ ఇమేజ్)

‍‍‍‍Narendra Modi: బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ షట్‌ఖిరా జిల్లాలోని ఈశ్వరీపూర్‌లో గల ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఈ రోజు ఉదయం మోదీ సందర్శించారు. అనంతరం కాళీమాతను దర్శించుకున్న ఆయన నేలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక బంగారు ముకుటాన్ని(కిరీటాన్ని) అమ్మవారికి అలంకరించారు.''నేడు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకునే అదృష్టం లభించింది. కొవిడ్ మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని నేను కాళీమాతను ప్రార్థించాను'' అని మోదీ తెలిపారు.

శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగబంధు ముజిబుర్‌ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన కుమార్తెలయిన ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహానాలకు అందజేశారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. భారత్‌, పొరుగు దేశాల్లోని 51 శక్తిపీఠాల్లో జెషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటి. 16వ శతాబ్దంలో హిందూ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 

Tags:    

Similar News