Modi Govt Gone Missing : మోడీ ప్రభుత్వం కనిపించడం లేదు : రాహుల్ గాంధీ
Modi Govt Gone Missing : దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటేసినా నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు
Modi Govt Gone Missing : దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటేసినా నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య జూలై 17న 10 లక్షలు దాటిన రోజున అయన ట్విట్టర్ వేదికగా "దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఆగస్టు 10 లోపు 20 లక్షల మందికి కరోనా సోకుతుంది" అని అయన ట్వీట్ చేశారు. పాత ట్వీట్ ని రీట్వీట్ చేసిన రాహుల్ " కేసులు 20 లక్షలు దాటాయి.. మోడీ ప్రభుత్వం కనిపించడం లేదు" అని ట్వీట్ చేశారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తప్పకుండా ప్రణాళికలు వేసుకుని, సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ పేర్కొన్నారు.
10,00,000 का आँकड़ा पार हो गया।
— Rahul Gandhi (@RahulGandhi) July 17, 2020
इसी तेज़ी से #COVID19 फैला तो 10 अगस्त तक देश में 20,00,000 से ज़्यादा संक्रमित होंगे।
सरकार को महामारी रोकने के लिए ठोस, नियोजित कदम उठाने चाहिए। https://t.co/fMxijUM28r
ఇక భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 20 లక్షల 27 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 62,538 కేసులు నమోదు కాగా, 886 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 49,769 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 20,27,075 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,07,384 ఉండగా, 13,78,105 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 41,585 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67. 98 శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,27,88,193 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,39,042 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లిడించింది.