Modi Government on Banks privatization: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 5కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య!

Modi Government on Banks privatization: బ్యాంకింగ్ పరిశ్రమను సరిదిద్దడంలో భాగంగా మోదీ సర్కార్ బిగ్ ప్లాన్‌తో ముందకు వెళ్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సగం బ్యాంకులను

Update: 2020-07-21 08:59 GMT
Banks( File Photo)

Modi Government on Banks privatization: బ్యాంకింగ్ పరిశ్రమను సరిదిద్దడంలో భాగంగా మోదీ సర్కార్ బిగ్ ప్లాన్‌తో ముందకు వెళ్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సగం బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అంతా అనుకున్నట్లుగానే జరిగితే భవిష్యత్‌లో కేవలం 5 ప్రభుత్వ రంగ బ్యాంకులే మిగలనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో మోదీ సర్కార్ ఇదే అంశం పైన కేబినెట్ ముందకు రాబోతుందని సమాచారం..

ప్రభుత్వం ముందుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీ్స్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వంటి వాటిల్లో ప్రభుత్వం తన వాటాలను విక్రయించనుంది. ఇక దీనిపైన ఓ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. దేశంలో కేవలం నాలుగు నుంచి ప్రభుత్వ బ్యాంకులు ఉండాలనే ఆలోచన కేంద్రం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం, భారత్ లో 12 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు ఉన్నాయి.ఈ ఏడాది 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులుగా మార్చింది. దీంతో 2020 ఏప్రిల్ 1 నుంచి దేశంలో 12 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. 2017లో ప్రభుత్వ బ్యాంకులు 27 ఉండేవి. ప్రభుత్వం ప్రస్తుతం రూపొందిస్తున్న కొత్త ప్రైవేటీకరణ ప్రతిపాదనలో ఇటువంటి ప్రణాళికను రూపొందిస్తామని, దీనిని ఆమోదం కోసం కేబినెట్ భేటి కానుందని ఆ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.  


Tags:    

Similar News