Rajnath Singh: సాయుధ దళాల కార్యక్రమాలు ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి

Update: 2021-08-14 01:57 GMT

రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ (ఫైల్ ఇమేజ్)

Rajnath Singh: మన దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను రాజ్‌నాథ్ ప్రారంభించారు. 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుందని చెప్పారు. ఒకే భారత దేశం, శ్రేష్ఠమైన భారత దేశంగా ఎదగాలన్నారు. సౌభాగ్యవంతమైన, స్వయం సమృద్ధి సాధించిన, ఆత్మ గౌరవంగల దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. 

Tags:    

Similar News