Kishan Reddy personal website hacked:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాకింగ్
Kishan Reddy personal website hacked: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ హ్యాక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాయాది దేశమైన పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది
Kishan Reddy personal website hacked: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ హ్యాక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాయాది దేశమైన పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఆగస్టు 15 నుండి కిషన్ రెడ్డి వెబ్ సైట్ లో దేశ వ్యతిరేక పోస్టులు కనిపించడాన్ని ఆయన అనుచరులు గుర్తించారు. దీంతో వెబ్ సైట్ హ్యాక్ కు గురైనట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌పై 'temporarily unavailable' అన్న సందేశం కనిపిస్తోంది. దీని వెనక అసలు కారణాలను వెతికేందుకు సాంకేతిక నిపుణలు ప్రయత్నిస్తున్నారు.
అయితే అది కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ కావడంతో దానిలో దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి సమాచారం పొందుపర్చలేదని కేవలం వ్యక్తిగత కార్యక్రమాలకు సంబందించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్ సైట్ ను హ్యాకర్ల నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సైబర్ పోలీసులు తెలిపారు.