School Admissions: ఆరేండ్లుంటేనే ఒకటో తరగతి.. కేంద్రం కీలక ఆదేశాలు..
School Admissions: పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
School Admissions: పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరేళ్లు ఉండాలనే నిబంధనను పాటించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.