కొవిడ్ మార్గదర్శకాలను మరోసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
కొవిడ్ నిబంధనల గడువు పొడిగించాలని..రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీచేసింది.
దేశంలో కోవిడ్ -19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను మరోసారి పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది. జనవరి 31వరకూ కరోనా మార్గదర్శకాలు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలు,కేంద్రపాలిత స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వరకు వర్తిస్తాయని పునర్ధుఘాటించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు అమలు చేసినట్లు స్పష్టం చేసింది. బ్రిటన్‌లో కలకలం సృష్టించిన కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు పేర్కొంది.
అయితే అన్ని రాష్ట్రాలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త కరోనా వైరస్ స్టెయిన్ నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్‌ల గుర్తింపు, ఆయా జోన్‌లలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. నవంబర్ 25న కేంద్ర హోంశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేసింది.
తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాపించేసిందా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 20 మంది రిపోర్టులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన సీసీఎంబీ పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి కూడా పంపించింది. రాష్ట్రంలోకి స్ట్రెయిన్ వచ్చిన మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నా ఈ 20 మందిలో ఎంత మందికి స్ట్రెయిన్ ఉందన్నది మాత్రం ఇంకా వైద్యాధికారులు వెల్లడించలేదు. అనధికారిక సమాచారం ప్రకారం మూడింటా ఒక వంతు మందిలో N440k ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా మ్యుటేట్ అవుతోందని కూడా అధికారులు చెబుతున్నారు.