త్రివర్ణపతాకంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కశ్మీర్‌లో ప్రత్యేక జెండా ఎగిరేసే అనుమతి వచ్చే వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయమనటంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 14 నెలల నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన ముఫ్తీ నిన్న మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామన్నారు.
జమ్ముకశ్మీర్ భూమిపై ఏ శక్తీ ప్రత్యేక జెండాను ఎగువేయలేదని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. ముఫ్తీ వ్యాఖ్యల్ని గవర్నర్ తీవ్రంగా పరిగణించాలని కోరారు. మరోవైపు దేశ సమగ్రత, త్యాగాలను చాటే త్రివర్ణ పతాకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దన్నారు.