సామాన్యుడిపై మరో భారం.. ఏప్రిల్ 1నుంచి పెరగనున్న మెడిసిన్ ధరలు
Medicine Prices Hike: 10.8 శాతం పెరగనున్న 800 రకాల మందుల ధరలు...
Medicine Prices Hike: ఇప్పటికే వంట నూనెలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రెట్లు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఏప్రిల్ 1 నుంచి మెడిసిన్స్ రెట్లు పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరో భారం పడనుంది. మెడిసిన్స్ రెట్లు పెరుగుతుండటంతో కొనేదెలా అని సామాన్యుడు కలవరపడుతున్నాడు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన అది చివరికి సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంది. ఎల్లుండి నుంచి మందుల ధరలు కూడా పెరగబోతున్నాయన్న వార్త సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
మారిన జీవనశైలిలో బాగంగా మెడిసిన్స్ వాడుతున్న వారు రోజురోజుకి పెరుగుతున్నారు. బి.పి, షుగర్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు అయిన వీటిని వినియోగిస్తున్నారు. ఇంట్లో 50యేళ్లు పైబడిన వారు. కిడ్నీ, గుండె సమస్యలు ఉన్న వారు ఉంటే నెలకి వేల రూపాయల మందులు వాడాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో నెలవారీ జీతంలో కొంత మందుల కోసం కేటాయించాల్సిన పరిస్థితి. తాజాగా మెడిసిన్స్ రెట్లు పెరుగడంతో 20శాతం అధకంగా కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్యాకింగ్, ముడి చమురు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడంతో ఫార్మా కంపెనీలు మెడిసిన్స్ పెంచాలని కోరాయి. నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ నుంచి మందుల ధరలు పెంచుకోడానికి ఫార్మా కంపెనీలకు అనుమతులు వచ్చాయి. దీంతో 800 మెడిసిన్స్ ధరలు 10 శాతం పెరగనున్నాయి. కొన్ని మెడిసిన్స్ పై 20 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. గత ఏడాది మెడిసిన్స్ ధరలు.. ఈ ఏడాది మెడిసిన్స్ ధరలు పోలిస్తే 10 శాతం మేర పెరిగినట్లు మెడికల్ షాప్ యజమానులు చెప్తున్నారు. దీంతో పెయిన్ కిల్లర్లు.. యాంటీబయాటిక్స్ తో సహా పలు అత్యవస మెడిసిన్స్ భారీగా రెట్లు పెరగనున్నాయి.
దేశంలో ఇక రోజూ వారి మెడిసిన్స్ వాడే వారికి మందుల ధరల పెరుగుదల పెద్ద ఇబ్బందిగా మారనుంది. రక్తహీనత, బీపీ, గుండెజబ్బులు, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు తదితరాల చికిత్సలో వినియోగించే మెట్రోనిడాజోల్, అజిత్రోమైసిన్, పారాసిటమాల్ వంటి మందులతో పాటు ఈ జాబితాలో ఉన్నాయి.