కొండచరియలు విరిగిపడి నదిపై ఉన్న డాం మీద పడటంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. దీంతో..ఒక గ్రామం మొత్త్హం నీటిలో మునిగిపోయింది. దాదాపు 100 నుంచి 150 మంది ప్రజలు గల్లంతు అయివుంటారని భావిస్తున్నారు. విషాదకరమైన ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రుషి గంగ పవర్ ప్రాజెక్టు వరదనీటితో నిండిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో తపోవన్ రెయినీ ఏరియాలో గ్లేసియర్ (హిమప్రాంతం) కూడా ఒక్కసారిగా దీని ప్రభావానికి గురికావడంతో కొండచరియలు సరిగ్గా డాం మీద విరిగి పడ్డాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో డ్యాం నుంచి నీరు పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాలు జల సమాధి అయ్యాయి.
ఈ ప్రమాదం కారణంగా భారీ జన నష్టం.. ఆస్తినష్టం జరిగినటు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను ఆరాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కొట్టిపడేశారు. వదంతులు నమ్మవద్దని కోరారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి అయన వెంటనే బయలుదేరి వెళ్లారు. అయితే, అక్కడ 150 వరకూ గల్లంతు అయినట్టు వార్తలు వస్తున్నాయి.