మళ్లీ మాస్క్ మస్ట్.. అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ
* ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తం చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్
Wear A Mask: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అడ్వైజరీ జారీ చేసింది. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని, బహిరంగ సభలు, సమావేశాలు నివారించాలని, ప్రస్తుతానికి విదేశీ పర్యటనలు చేయకపోవడం మంచిదని పేర్కొంది. పబ్లిక్, ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని, ఆక్సిజన్, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.
దేశంలో గత 24 గంటల్లో 145 కేసులు నమోదైతే.. వాటిలో చైనా కొత్త వేరియంట్ BF-7 4 కేసులున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి దేశంలో పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఏ వివరించింది.