Indian Railways: పలు రైళ్ళ సర్వీసులను రద్దు చేస్తున్న ఇండియన్ రైల్వే
Indian Railways: కరోనా ఎఫెక్ట్ రైల్వే సంస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పలు రైళ్ల సర్వీలను ఇండియన్ రైల్వే రద్దు చేసింది
Indian Railways: కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపట్టడం.. చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించడంతో ప్రయాణాలకు ప్రజలు మొగ్గు చూపడం లేదు. మరో 28 రైళ్లను రద్దు చేసింది. ఇందులో 24 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో 4 రైళ్లను మాత్రం పాక్షికంగా వివిధ స్టేషన్ల మధ్య రద్దు చేసింది.
ఈ ఏడాది మేలో ఇప్పటివరకు 1.76 కోట్ల మంది ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా ప్రయాణించారు. తగ్గిన డిమాండ్‌కు ప్రతిస్పందనగానే కాకుండా, అనవసరమైన ప్రయాణాన్ని నిరుత్సాహపరిచేందుకు కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ రైలు సర్వీసులను తగ్గించారు. రెండవ వేవ్ ప్రారంభానికి ముందు వరకూ దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 1,500 రైళ్ళు నడిచేవి. క్రమేపీ రైళ్ల సంఖ్య రోజుకు 865 కు తగ్గించారు. ఇందులో "ప్రత్యేక" రైళ్లు ఉన్నాయి. కరోనా మహమ్మారి మొదట ప్రారంభం అయ్యే సమయంలో అంటే 2020 ప్రారంభంలో, ప్రతిరోజూ 1,768 సుదూర రైళ్లు నడిచాయి.