చిన్నారులను వణికిస్తోన్న గుండె సమస్యలు

-నవజాత శిశువులను వెంటాడుతున్న హార్ట్‌ ప్రాబ్లమ్స్ -హెల్త్‌ టిప్స్‌ను పాటించని గర్భిణులు -పుట్టబోయే బిడ్డలపై ఎఫెక్ట్‌

Update: 2019-11-20 03:06 GMT
Heart problems in children

చిట్టి గుండెకు కష్టమొచ్చింది. ఒత్తిడితో అలసిపోతోంది. లేత ప్రాయంలోనే లయ తప్పుతోంది. బుడిబుడి అడుగులు వేయకముందే నలిగిపోతోంది. తల్లిగర్భంలోనే డేంజర్‌ బెల్స్‌ మోగుతోంది. పదిలమనుకున్న చిట్టిగుండెల చప్పుడు టెన్షన్‌ పుట్టిస్తోంది. ప్రమాదకరంగా మారుతున్న పసిహృదయాలకు కారణాలేంటో తెలియాలంటే స్టోరీకి ఎంటర్‌ కావాల్సిందే.

హార్ట్ ఎటాక్‌‌. చిన్నా పెద్దా అని తేడా లేకుండా వణికిస్తున్నాయి. హార్ట్‌ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నవజాతశిశువుపై ప్రభావ చూపుతున్నాయి. గర్భందాల్చినప్పటి నుంచి తల్లులు ఆరోగ్యాన్ని కాపాడుకోకుంటే ఆ ఎఫెక్ట్‌ పుట్టబోయే పిల్లలపై చూపుతోంది. ఈ సమస్య తీవ్రరూపం దాలిస్తే నెలలు నిండని శిశువులు, తక్కువ బరువు బిడ్డలు జన్మిస్తుంటారు. కొందరిలో నవ మాసాలు నిండ కుండానే, తక్కువ బరువు, పిల్లలు పుట్టి, పురిటిలోనే కన్నుమూస్తున్నారు. క్షేమంగా పుట్టిన కొంతమంది బెబీస్‌లో శ్వాస, గుండె సంబంధిత సమస్యలు పెరగడం కలవరపెడుతున్నాయి. బయటి ప్రపంచంలోకి బుడిబుడి అడుగులు వేయకముందే.. మయదారిరోగాలు చుట్టేస్తున్నాయి. చిట్టిగుండెలను పదిలంగా కాపాడాల్సిన తల్లులే చిదిమేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

శ్వాస, హార్ట్‌ డీసీసస్‌.. ప్రీ మెచ్యూర్ బేబీస్‌ను వెంటాడుతున్నాయి. పుట్టిన ప్రతి వంద మంది పిల్లల్లో ఎక్కువమంది గుండె సంబంధిత జబ్బులతో పుడుతున్నారని వైద్యులు అంటున్నారు. గర్బం దాల్చిన మహిళలల్లో మారిన లైఫ్‌స్టైల్.. ఫాస్ట్‌ఫుడ్‌ ప్రభావమే చిట్టి హృదయాలతో పాటు శరీర ఎదుగుదలపై పడుతోందని వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండా పుట్టే చిన్నారుల్లో అధిక శాతం గుండె జబ్బులు పుట్టుకతోనే రావచ్చని హెచ్చరిస్తున్నారు.

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు సరైన ఫుడ్‌ తీసుకోకపోవడం వల్లే నవజాత శిశువుల్లో గుండె సమస్యలు వస్తున్నాయని పలువురు మహిళలు వాపోతున్నారు. ఎక్కువ టెన్షన్‌ పడటం, పౌష్టిక ఆహారం అందకపోవడం వల్ల చిన్నారులకు సరైన విటవిన్స్‌ లబించకపోవడంతో పసియొగ్గల్లో గుండె ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నాయంటున్నారు.

డాక్డర్లు, పెద్దవాళ్ల సూచనలు, సలహాలు ఫాలో కాకపోవడమే ప్రధానకారణమని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. టైంకి మెడిసిన్‌ వేసుకోకపోవడం, నరైన నిద్రలేకపోవడంతో చిన్నారుల ఎదుగుదలకు శాపంగా మారుతున్నాయంటున్నారు.

గర్భం దాల్చినప్పటి నుంచి మంచి కేర్‌ తీసుకోవడంతో పాటు మెడిటేషన్‌, వ్యాయమం చేయాలని తల్లులకు వైద్యులు సూచిస్తున్నారు. ప్రెగ్నెసీ టైంలో ఎంత సంతోషంగా, ప్రశాంతంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యకరంగా పుడుతుందని,బిడ్డ ప్రాణాలకు తల్లే హెల్త్‌కేరే శ్రీరామరక్ష అంటున్నారు. 

Tags:    

Similar News