Manish Sisodia: తీహార్ జైలుకు సిసోడియా..
Delhi Liquor Scam: సిసోడియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఆరోపణ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యూడిషయల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈనెల 20 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పువెలువరించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో సిసోడియాను ప్రత్యేక భద్రత మధ్య తీహార్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కాం కేసులో రెండు రోజుల పాటు విధించిన కస్టడీ ముగియడంతో..ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. ఇప్పటికే ఏడు రోజుల పాటు సిసోడియాను విచారించింది సీబీఐ. అయితే సిసోడియా విచారణకు సహకరించడం లేదంటున్న సీబీఐ..మరోసారి కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతనెల 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.