Manipur Extends Lockdown: ఆ రాష్ట్రం కీలక నిర్ణయం .. ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు

Manipur Extends Lockdown: దేశంలో కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తున్నది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-08-15 16:42 GMT
Manipur extends lockdown till August 31

Manipur Extends Lockdown: దేశంలో కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తున్నది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న సంపూర్ణ లాక్‌డౌన్‌ను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసుల దృష్ట్యా మంత్రులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలిపారు.

కాగా,మణిపూర్ లో గత 24 గంటల్లో కొత్తగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,390కి చేరినట్టు పేర్కొంది. మొత్తం కేసులో 1,939 పాజిటివ్ కేసులు ఉండగా, 2,438 మంది క‌రోనాను జయించార‌ని, మృతుల సంఖ్య 13కి చేరిందని తెలిపింది. ఇదిలావుండగా దేశవ్యాప్తంగా ప్రతిరోజు 50 వేలకు పైగా కొత్తగా పాజిటివ్ కేసులు, 900కు పైగా మరణాలు నమోదు అవుతున్నాయి. 

Tags:    

Similar News