బట్టతలలో బంగారం.. విగ్గు తీసి చూసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్..
Gold Smuggling: స్మగ్లర్లు బంగారన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు.
Gold Smuggling: స్మగ్లర్లు బంగారన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. ఆధునికంగా ఉన్న అన్ని పద్ధతుల్లో బంగారం, మాదక ద్రవ్యాలను తరలించేందుకు యత్నించి తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. అయితే అతడి తెలివికి కస్టమ్స్ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. స్మగ్లింగ్‌ను ఇలా కూడా చేయొచ్చా? అనిపించేలా చేసిన అతడిని అధికారులు పట్టుకున్నారు. ఎంత క్రియేటివ్‌గా స్మగ్లింగ్ చేయాలని చూసిన అతడు చివరికి కటకటాలపాలయ్యాడు. తాజాగా సినిమాను తలపించేలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.
విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో అతడి సామగ్రిని తనిఖీ చేయగా ఏమీ కనిపించలేదు. అయితే బంగారంను గుర్తించే పరికరాలతో పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. బంగారాన్ని పేస్ట్‌గా చేసి అందులోని కొంత భాగాన్ని తల విగ్గులో, మరి కొంత భాగం పెద్ద ప్రేగు చివర మలం నిల్వ ఉండే రెక్టమ్‌లో దాచిపెట్టాడు. అబుదాబి నుంచి వస్తున్న సదరు ప్రయాణికుడి వద్ద నుంచి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏమాత్రం అనుమానం రాకుండా విగ్గులో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బయటకు తీశారు. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. స్మగ్లర్ తెలివిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.