Electricity Bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంటు బిల్లు.. బిల్లును చూసి.. ఒకరికి బీపీ, మరొకరికి రక్తపోటు

Electricity Bill: సాధారణంగా కరెంటు బిల్లు వస్తే 10వేల రూపాయల లోపు రావొచ్చు.

Update: 2022-07-27 09:17 GMT

Electricity Bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంటు బిల్లు.. బిల్లును చూసి.. ఒకరికి బీపీ, మరొకరికి రక్తపోటు

Electricity Bill: సాధారణంగా కరెంటు బిల్లు వస్తే 10వేల రూపాయల లోపు రావొచ్చు. కానీ అప్పుడప్పుడు విద్యుత్‌ సిబ్బంది తప్పిదాలతో వేల రూపాయల్లోనో, లక్షల రూపాయల్లోనో రావొచ్చు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాత్రం ఏకంగా 3 వేల 419 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. ఆ బిల్లు వచ్చింది న్యాయవాది ఇంటికి సాంకేతిక లోపం కారణంగా పొరబాటున వచ్చిందేమో అనుకున్నారు అయితే ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకున్నాడు. కానీ నిజంగానే 3వేల 419 కోట్ల రూపాయల బిల్లును చూసి విస్తుపోయాడు. పైగా బిల్లు చెల్లించకపోతే విద్యుత్‌ శాఖ దాడులు చేస్తుందని కూడా అందులో హెచ్చరిక కూడా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఆ న్యాయవాది భార్యకు బీపీ, గుండెనొప్పితో బాధపడుతున్న మామకు రక్తపోటు పెరిగి ఆసుపత్రి పాలయ్యారు.

గ్వాలియర్‌లోని సిటీసెంటర్‌ ఎంతో ఫేమస్‌ ఏరియా అక్కడి మెట్రో టవర్‌ వెనుక శివ బీహార్‌ కాలనీలో రెండంతస్తుల భవనంలో న్యాయవాది సంజీవ్‌ కనక్నే, భార్య ప్రియాంక గుప్త, మామా రాజేంద్రప్రసాద్‌ గుప్త ఉంటారు. తాజాగా సంజీవ్‌ కనక్నేకు విద్యుత్‌ బిల్లు వచ్చింది. అందులోని 3వేల 419 కోట్ల రూపాయలు మొత్తం చూసి సంజీవ్‌ కుటుంబం ఆశ్చర్యపోయింది. స్వతగాహా న్యాయవాది అయిన సంజీవ్‌ అది సాంకేతిక సమస్య కారణంగా పొరపాటున వచ్చిందని గ్రహించాడు. అయితే బిల్లు చెల్లించేందుకు సంజీవ్‌ ఆన్‌లైన్‌లో చెక్‌ చేశాడు. అయితే అందులోనూ 3వేల 419 కోట్ల బిల్లు కనిపించడంతో విస్తుపోయాడు. బిల్లు చెల్లించకపోతే దాడులు నిర్వహిస్తామని విద్యుత్‌ శాఖ హెచ్చరిక కూడా కనిపించింది. విషయం తెలుసుకున్న సంజీవ్‌ భార్య ప్రియాంక బీపీ పెరిగి కుప్పకూలింది. గుండెనొప్పితో బాధపడుతున్న మామ రాజేంద్రప్రసాద్‌ గుప్తాకు రక్తపోటు పెరిగింది. ఇద్దరినీ సంజీవ్‌ సకాలంలో ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే తప్పును తెలుసుకున్న విద్యుత్‌ శాఖ బిల్లును సవరించింది. 3వేల 419 కోట్ల రూపాయలకు బదులుగా 13 వందల రూపాయలు చెల్లించాలని సూచించింది. దీనిపై విద్యుత్‌ సంస్థ తన తప్పును అంగీకరించింది. ఇది మానవ తప్పిదమని సంస్థ జనరల్‌ మేనేజర్‌ నితిన్‌ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఉద్యోగిని తొలగించడంతో పాటు అసిస్టెంట్‌ రెవెన్యూ అధికారిని సస్పెండ్‌ చేశారు. జూనియర్ ఇంజనీర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై మధ్యప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్ కూడా స్పందించారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. తప్పును సరిదిద్దుకున్నట్టు మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News