Viral Video: బీభత్సం సృష్టించిన ఎంపీ కారు.. ఓ వ్యక్తిని గుద్ది.. 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..

Viral Video: హిట్ అండ్ రన్ కేసులు ఈమధ్య తరచుగా జరుగతున్నాయి.

Update: 2023-05-01 08:00 GMT

Viral Video: బీభత్సం సృష్టించిన ఎంపీ కారు.. ఓ వ్యక్తిని గుద్ది.. 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..

Viral Video: హిట్ అండ్ రన్ కేసులు ఈమధ్య తరచుగా జరుగతున్నాయి. ఓ స్కూటరిస్ట్ ని కారు తో ఢీకొట్టిన మహిళ సదరు వ్యక్తిని కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన మరువక ముందే దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కారు డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ఓ వ్యక్తిని ఢీ కొట్టి అతడిని బానెట్ పై దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ కారు బీహార్ ఎంపీ చందన్ సింగ్ కు చెందినదిగా తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..చేతన్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతడి కారుని రాంచంద్ కుమార్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టాడు. దీంతో చేతన్ కారు దిగి రాంచంద్ కారును ఆపే ప్రయత్నం చేయగా అతడు పట్టించుకోకుండా చేతన్ పై కారును పోనివ్వడంతో అతను బానెట్ పైనే ఉండిపోయాడు. అలా చేతన్ ను మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఇక అదే సమయంలో గస్తీ కాస్తున్న పోలీసులు ఈ దృశ్యాన్ని చూసి రాంచంద్ కారును వెంబడించి బాధితుడిని రక్షించారు.

ఈ ఘటనలో చేతన్, రాంచంద్ వాదనలు భిన్నంగా ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న రాంచంద్ తన కారును మూడు సార్లు ఢీకొట్టాడని..ఆపి అడిగితే తన పై కారును పోనిచ్చాడని దీంతో కారు బానెట్ పై ఉండిపోయినట్లు ఫిర్యాదు చేస్తున్నాడు. మరోవైపు చేతన ఉద్దేశపూర్వకంగానే తన కారు బానెట్ పైకి ఎక్కి తనను కారులోంచి దిగమని నానా హంగామా చేశాడని రాంచంద్ ఆరోపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించిన కారు బీహార్ ఎంపీ చందన్ సింగ్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో ఎంపీ కారులో లేరని అతడి డ్రైవర్ నడుపుతున్నారని తెలిపారు. కారును ర్యాష్ గా నడిపిన రాంచంద్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags:    

Similar News