విషాదం: హెలికాఫ్టర్ తయారు చేశాడు.. చివరకు ఆ హెలికాప్టర్‌కే బలైపోయాడు..
Maharashtra: హెలికాప్టర్ తయారు చేద్దామని కలలు కన్న ఓ వ్యక్తి ఆ హెలికాప్టర్‌కే బలైపోయాడు.
Maharashtra: హెలికాప్టర్ తయారు చేద్దామని కలలు కన్న ఓ వ్యక్తి ఆ హెలికాప్టర్‌కే బలైపోయాడు. మహారాష్ట్రలోని మహగావ్ గ్రామానికి చెందిన మెకానిక్ షేక్ ఇస్మాయిల్ రెండేళ్ల పాటు కష్టపడి ఓ మినీ హెలికాప్టర్‌ను తయారు చేశాడు. అయితే, ఆ హెలికాప్టర్‌ను పరీక్షిస్తుండగా ప్రమాదం జరగడంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. హెలికాప్టర్ పరీక్షిస్తున్న వేళ దాని బ్లేడ్ విరిగి అతడిపైనే పడింది. దీంతో అక్కడే ఉన్న అతడి స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఇస్మాయిల్ మృతితో మహగావ్ గ్రామం విషాదంలో మునిగిపోయింది.