AstraZeneca Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నాక రక్తం గడ్డ కట్టి వ్యక్తి మృతి
Covishield: కోవి షీల్డ్ వ్యాక్సిన్‌పై యూరోప్‌లోని కొన్ని దేశాలు, ఆప్రికన్ యూనియన్ దేశాలు వినియోగించడంలేదు.
Covishield: కోవి షీల్డ్ వ్యాక్సిన్‌పై యూరోప్‌లోని కొన్ని దేశాలు, ఆప్రికన్ యూనియన్ దేశాలు వినియోగించడంలేదు. టీకా తీసుకున్నాక కొందరికి తీవ్రమైన దుష్పలితాలు రావడమే దీనికి కారణం. తాజాగా ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న ఓ వ్యక్తి కెనడాలో మరణించాడు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు సంబంధించినంత వరకు కెనడాలో ఇదే తొలి మరణం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో కెనడాలోని అల్బెర్టాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. కెనడాలో ఇప్పటివరకు 2.5 లక్షల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోస్‌లను ఉపయోగించగా, ఇదే తొలి మరణమని ఆయన తెలిపారు.