తెలుగోడికి అరుదైన గౌరవం..దేశంలోని అత్యున్నతమైన పదవిని..

Mamidala Jagadesh Kumar: తెలుగోడికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూనివర్విటీ గ్రాంట్‌ కమిషన్‌-యూజీసీ చైర్మన్‌గా నల్లగొండకు చెందిన మామిడాల జగదీశ్‌ కుమార్‌ నియమితులుయ్యారు.

Update: 2022-02-04 15:30 GMT

తెలుగోడికి అరుదైన గౌరవం..దేశంలోని అత్యున్నతమైన పదవిని..

Mamidala Jagadesh Kumar: తెలుగోడికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూనివర్విటీ గ్రాంట్‌ కమిషన్‌-యూజీసీ చైర్మన్‌గా నల్లగొండకు చెందిన మామిడాల జగదీశ్‌ కుమార్‌ నియమితులుయ్యారు. దేశంలోని అత్యున్నతమైన పదవిని కేంద్రం తెలుగుతేజానికి కట్టబెట్టింది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన జగదీశ్‌ కుమార‌ ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ విభాగంలో ప్రొఫెసర‌గా పని చేశారు. 2016 నుంచి ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌ చాన్సలర్‌గా ఆచార్య మామిడాల జగదీశ్‌ కుమార్‌ పని చేస్తున్నారు. ఆయన పదవీ కాలం గతేడాది జనవరితోనే ముగిసింది. అయితే కొత్త వీసీని నియమించేవరకు కొనసాగాలని జగదీశ్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది.

యూజీసీ చైర్మన్‌ పదవికి నోటీపికేషన్ జారీ కాగా మొత్తం 55 మంది దరకాస్తు చేసున్నారు. కమిటీ ప్రాథమికంగా ఏడుగురిని ఎంపిక చేసింది. వారిలో ముగ్గురిని కమిటీ ఎంపిక చేసి కేంద్రానికి పంపింది జగదీష్‌ కుమార్‌ను ఎంపిక చేసింది. యూజీసీ చైర్మన్‌గా ఎంపికైన మూడో తెలుగు వ్యక్తిగా జగదీశ్ కుమార‌ నిలిచారు. 1961లో వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991లో జి. రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పని చేశారు.  

Tags:    

Similar News