Anti BJP Front: కొత్త ఫ్రంట్ ఏర్పాటు వైపు మమతా బెనర్జీ అడుగులు
Anti BJP Front: భారత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు జరగాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
Anti BJP Front: భారత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు జరగాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తన ఢిల్లీ పర్యటనతోనే అందుకు నాంది పలకాలన్నారు. ఈ మేరకు బీజేపీయేతర పార్టీలకు పిలుపునిచ్చిన మమత తన ఢిల్లీ పర్యటనలో అన్ని పార్టీల నేతలతో సమావేశం అవుతానన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందంటూ ఫ్రంట్ ఏర్పాటులో ఆలస్యం తగదని పిలుపిచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో మమత ఢిల్లీ వెళ్లనున్నారు.