Mamata Banerjee: ఇవాళ మోడీని కలవనున్న మమత బెనర్జీ..!!
* ఢిల్లీ పర్యటనలో మమతా బెనర్జీ * విపక్ష నేతల్ని కలవనున్న మమతా * విపక్షాల ఏకీకరణ ప్రధాన ఎజెండాగా పర్యటన
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో విపక్ష నేతల్ని కలవనుండటంతో పర్యటన కాస్తా ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణ ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయని అన్పిస్తోంది. మమతా ఢిల్లీ పర్యటన వెనుక కారణాల గురించి రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీన ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్నారు. ఇక ప్రధాని మోదీని సైతం ఇవాళ మమతా కలిసే అవకాశం ఉంది. ప్రధాని అభ్యర్ధి వరుసలో మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారని అందుకే ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించారని కొందరు అంటున్నారు. దీంతో దీదీ ఢిల్లీ పర్యటన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.