Mamata Banerjee: సొంత నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ

Mamata Banerjee: ఇటీవల ప‌చ్చిమ‌ బెంగాల్ కు జరిగిన శాస‌న‌స‌భ ఎన్నికల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ అధికారం చేప‌ట్టింది.

Update: 2021-05-21 15:00 GMT

Mamata Banerjee 

Mamata Banerjee: ఇటీవల ప‌చ్చిమ‌ బెంగాల్ కు జరిగిన శాస‌న‌స‌భ ఎన్నికల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ అధికారం చేప‌ట్టింది. కానీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలోకి దిగిన మమత బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓట‌మి చ‌విచూశారు. పార్టీ విజ‌యం సాధించ‌డంతో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోగా ఆమె ఎదైనా ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో, తన పాత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. భవానీపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. భవానీపూర్ ఓటరుగా మమతా బెనర్జీ ఉన్నారు.

ఎన్నికల సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. నందిగ్రామ్ తన పెద్ద సోదరి, భవానీపూర్ తన చిన్న సోదరి అని చెప్పారు. నందిగ్రామ్ తన లక్కీ ప్లేస్ అని, అందుకే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. భవానీపూర్ ప్రజలు తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు.తన స్థానం నుంచి దీదీ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. అయితే ఈ 6 నెలల కాలం ఆయన మంత్రిగానే కొనసాగనున్నారు.

Tags:    

Similar News