Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై దీదీ ఫైర్
Mamata Banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది.
Mamata Banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. ఘెరావ్ సీఆర్‌పీఎఫ్ జవాన్స్ అని ఆమె పిలుపునిచ్చారని.. దేశ వ్యతిరేకమైన ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది బీజేపీ. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆమెపై నిషేధం విధించాలని కోరింది. బీజేపీకి చెందిన సీఆర్‌పీఎఫ్ బలగాలు మహిళలను కొడుతూ వేధిస్తున్నారంటూ మమత ఆరోపించారు. హోం మంత్రి ఆదేశాల మేరకే వారు అలా చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై బెంగాల్ సీఎం మమత విరుచుకుపడ్డారు. నందిగ్రామ్ ముస్లింలను పాకిస్తానీలంటూ వ్యాఖ్యానించిన ఎందరిపై కేసులు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలా వ్యాఖ్యానించడానికి వారికి సిగ్గులేదా? అంటూ పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని, తాను అన్ని వర్గాల వారికీ అండగా నిలుస్తానని మమత స్పష్టం చేశారు. ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు ప్రతిస్పందనగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు10 షోకాజ్ నోటీసులు జారీ చేసినా, లెక్కచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారామె.