జిఎస్టి బకాయిలపై ప్రధాని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ

జిఎస్టి బకాయిల చెల్లింపు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికే ఐదుగురు..

Update: 2020-09-02 10:50 GMT

జిఎస్టి బకాయిల చెల్లింపు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంతులు లేఖ రాశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి మమతా బెనర్జీ కూడా లేఖ రాశారు, జిఎస్టిలో కోత విధిస్తున్నారని.. అలాగే కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రాలకు పరిహారం ఇవ్వడానికి కేంద్రం నిరాకరించిందని, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ విశ్వాసం మరియు నైతిక బాధ్యతగా ఉండటం అవసరమని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలకు సహాయం చేయడానికి బదులుగా వాటిపై మరింత ఆర్థిక భారం వేసే విధంగా వ్యవహరించడం కేంద్రానికి సరైనదేనా? అని ఆమె ప్రశ్నించారు.

మే జూన్ నెలల్లో జిఎస్టి వాపసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ .4100 కోట్లు రావాల్సి ఉందని, కాని ఇంతవరకూ ఆ డబ్బు తమకు రాలేదని.. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపడం ఎలా సాధ్యమవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాగా మమత తోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు , కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, చ్చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ లు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. 

Tags:    

Similar News