మహారాష్ట్ర మాజీ సీఎంకి కరోనా!

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సామాన్యుల ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా కరోనా సోకింది.

Update: 2020-10-24 10:34 GMT

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సామాన్యుల ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్నీ ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. 'లాక్‌డౌన్‌ నుంచి నిరంతరం పనిలో ఉన్నాను. ఇపుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడు' అని అయన ట్వీట్ చేశాడు. ఇక తనతో గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇక అయన అభిమానులు, కార్యకర్తలు, బీజేపీ నేతలు అయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అటు దేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 54,366 కేసులు నమోదు కాగా, 690 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 73,979 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 77,61,312కు చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 6,95,509 ఉండగా, 69,48,497 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,17,306 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 89.53 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Tags:    

Similar News