Lockdown Extension in Maharashtra: జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

Update: 2020-06-29 10:50 GMT

Maharashtra Extends Lockdown Till July 31: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి రాష్ట్ర‌మంతా లాక్‌డౌన్ విధించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది. అంతేకాదు…'#Mission Begin Again' అనే పేరుతో కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను బట్టి ఆంక్షలను విధించాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం కాని కార్యకలాపాలను కట్టడి చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5493 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,626 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 86,575మంది కోలుకోగా.. 7429 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరగడంతో ఇప్పటికే పలు నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News