ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం.. ఆ నగరం పేరు మార్పు..
Maharashtra: రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Maharashtra: రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ 2 నగరాల పేర్లతో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని నవీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.