Maharashtra building collapses : మహారాష్ట్రలో ఘోర విషాదం.. కుప్పకూలిన భవనం..
మంది మరణించారని, అలాగే శిధిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని థానే మునిసిపల్ కార్పొరేషన్ పిఆర్ఓ సోమవారం ఉదయం తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం..
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. థానేలోని భివాండి నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఎనిమిది మంది మరణించారని, అలాగే శిధిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని థానే మునిసిపల్ కార్పొరేషన్ పిఆర్ఓ సోమవారం ఉదయం తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, స్థానికులు మరియు అధికారులు 25 మందిని శిథిలాల నుండి రక్షించారు. అయినప్పటికీ, 20 నుండి 25 మంది దాకా చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
1984 లో జిలానీ అపార్ట్‌మెంట్ హౌస్ నంబర్ 69ను నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. 21 ఫ్లాట్లు ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కూలిపోయింది, ఆ సమయంలో నివాసితులందరు ఘాడ నిద్రలో ఉన్నారు. అయితే తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.